ముంబై సిద్ది వినాయక (Mumbai Siddi Vinayaka) ఆలయం స్పెషాలిటీ
ముంబై: దేశంలో ఎన్నో వినాయక ఆలయాలు ఉన్నాయి. కానీ ముంబై నగరంలో కొలువైన శ్రీ సిద్ధివినాయక్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. గుడిలో ఉన్న వెండి ముషికం చెవులలో భక్తులు తమ కోరికలు చెప్తే అవి గణనాథునికి చెప్తాయని, ఆ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో గణేశుని వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ముంబై వాసుల కొంగు బంగారంగా ఇక్కడి సిద్ధి వినాయకుడిని పూజిస్తారు. పిల్లలు లేని వారు ఈ స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని 1801 నవంబర్ 19న లక్ష్మణ్ వితు, దుబే పాటిల్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.
అప్పట్లో చిన్న ఆలయంగా ఉన్న ఈ గుడి కలక్రమంలో ఆరు అంతస్తులకు విస్తరించారు. ప్రతి మంగళవారం దాదాపు డెబ్బై వేల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక ముఖ్యమైన పర్వదినాలలో ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముంబై ఎంతో ఐశ్వర్యవంతమైన దేవాలయంగా పేరుగాంచింది. ఆలయానికి ఏడాదికి రూ. పదికోట్లకు పైగా కానుకలు వస్తుంటాయి. ఈ ఆలయం సంపద విలువ రూ. 350 కోట్లకు పైగా ఉంటుంది. ప్రతిరోజు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక గణేశ్ నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారిని విలువైన బంగారు, వజ్రాభరణాలతో అలంకరిస్తారు.
నాలుగు చేతులతో కొలువుదీరిన గణనాథుడు
ఇక్కడి వినాయకుడిని 2.5 అడుగుల ఎత్తులో ఒకే నల్లరాతి ముక్కతో రూపొందించారు. నాలుగు చేతులు కలిగిన ఈ గణనాథుడు ఓ చేతిలో పూసల దండ, కమలం, చిన్న గొడ్డలి, మోదకాలతో కూడిన పళ్లెం పట్టుకుని ఉంటాడు. ఆయనకు ఇరువైపుల ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి ఉంటారు. ఈ విగ్రహం నుదిటిపై శివుని కుడి కన్ను మాదిరిగా గుర్తును చెక్కారు.
ఆలయానికి చేరుకునే మార్గం
ముంబై నగరంలో కొలువైన (Mumbai Siddi Vinaya) సిద్ధి వినాయకుని ఆలయానికి చేరుకునేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయం ఉంది. విమానం ద్వారా వచ్చే వారు ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుంచి టాక్సీలు, క్యాబ్, బస్సుల ద్వారా 13 కి.మీ. ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. రైలులో వచ్చే వారు దాదర్ రైల్వేస్టేషన్ చేరుకోవాలి. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న ఆలయానికి చేరుకునేందుకు బస్సులు, ట్యాక్సీలు, క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గంలో వచ్చేవారికి ప్రజారవాణ, కార్లు, క్యాబ్ అందుబాటులో ఉంటాయి.
నాలుగు చేతులతో కొలువుదీరిన గణనాథుడు
ఇక్కడి వినాయకుడిని 2.5 అడుగుల ఎత్తులో ఒకే నల్లరాతి ముక్కతో రూపొందించారు. నాలుగు చేతులు కలిగిన ఈ గణనాథుడు ఓ చేతిలో పూసల దండ, కమలం, చిన్న గొడ్డలి, మోదకాలతో కూడిన పళ్లెం పట్టుకుని ఉంటాడు. ఆయనకు ఇరువైపుల ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి ఉంటారు. ఈ విగ్రహం నుదిటిపై శివుని కుడి కన్ను మాదిరిగా గుర్తును చెక్కారు.
Also read:
Ganapati: గణేశ్ సాంగ్స్.. ధూంధాం
Cinema: గణపయ్య సినిమాలు చూసేద్దామా!
