Musi dam: మూసీ గేట్లు ఓపెన్

మూసీ గేట్లు ఓపెన్ – ప్రాజెక్టులోకి భారీ వరద ప్రవాహం.

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు(Musi dam) గేట్లను ఇవాళ అధికారులు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం 1,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 643 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు 3, 8 నంబరు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1,293 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.(Musi dam)

గేట్లు తెరిచే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో జనరేటర్ సాయంతో గేట్లను లిఫ్ట్ చేశారు. మొదట 2, 8 నంబరు గేట్లను ఎత్తాలని పూజలు చేసినా, సాంకేతిక లోపం కారణంగా చివరికి 3, 8 గేట్ల ద్వారానే నీటిని విడుదల చేశారు.

మూసీ నదీ తీర ప్రాంతాల్లోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరించారు.

Also Read :