విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ స్టార్ లో తన పాత్రపై తాజాగా ఈ మృణాల్ ఠాకూర్ ఇన్స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అందులో తాను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది. ‘నేను ఇందుగా ఉన్న క్షణాలు. ఇందు నేనుగా ఉన్న క్షణాలు. తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి. ఆమెలా కేవలం షూస్ ధరించడం మాత్రమే కాదు.. ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా’ అంటూ పోస్ట్ చేసింది. కాగా ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ఇందు పాత్రలో నటించింది. ఓ కంపెనీకి సీఈవోగా నటించి మెప్పించింది.
Also read :
K. Laxman : కాంగ్రెస్కు బీఆర్ఎస్గతే
Karimnagar : విభజన హామీల కోసం దీక్ష

