ఆదివాసుల ఇలవేల్పు ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర (Nagoba jatara) లో భాగంగా కఠిన నియమాలు, దీక్షలతో నిర్వహించే మెస్రం వంశస్థుల పూజల్లో చివరి సంప్రదాయ వీడ్కోలు పూజల ఘట్టం విశిష్టతగా జరిగింది. తమ ఆరాధ్య దైవం (Nagoba jatara) నాగోబా తమ పూజలకు అనుగ్రహించిందని ప్రగాఢంగా నమ్ముతూ వీడ్కోలు పూజలను చేశారు. ఇవాళ బేతాల్, మండ గాజలి పూజల్లో భాగంగా అద్భుతమైన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంప్రదాయ వాయిద్యాలతో తమ జాతి వంశ పెద్దలను గౌరవిస్తూ బేతాల్ డ్యాన్సులు చేస్తూ చివరిసారి నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు.

జాతరలో భాగంగా నాలుగోరోజు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి, నాగోబాను తీరొక్క పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులు సమర్పించిన పేలాలు, కొబ్బరికాయలు ఒక చోటికి పేర్చి వాటిని మెస్రం వంశీయులకు అందజేసి, నాగోబా జాతర పూజలకు వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి ఉట్నూర్ మండలం శ్యాంపూర్ లో కొలువైన బుడందేవేత మూర్తులకు పూజలు చేసేందుకు నాగోబా సన్నిధి నుండి మెస్రం వంశస్థులు పయనమయ్యారు.
ఆదివాసుల ఇలవేల్పు ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర లో భాగంగా కఠిన నియమాలు, దీక్షలతో నిర్వహించే మెస్రం వంశస్థుల పూజల్లో చివరి సంప్రదాయ వీడ్కోలు పూజల ఘట్టం విశిష్టతగా జరిగింది. తమ ఆరాధ్య దైవం నాగోబా తమ పూజలకు అనుగ్రహించిందని ప్రగాఢంగా నమ్ముతూ వీడ్కోలు పూజలను చేశారు. ఇవాళ బేతాల్, మండ గాజలి పూజల్లో భాగంగా అద్భుతమైన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంప్రదాయ వాయిద్యాలతో తమ జాతి వంశ పెద్దలను గౌరవిస్తూ బేతాల్ డ్యాన్సులు చేస్తూ చివరిసారి నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా నాలుగోరోజు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి, నాగోబాను తీరొక్క పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులు సమర్పించిన పేలాలు, కొబ్బరికాయలు ఒక చోటికి పేర్చి వాటిని మెస్రం వంశీయులకు అందజేసి, నాగోబా జాతర పూజలకు వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి ఉట్నూర్ మండలం శ్యాంపూర్ లో కొలువైన బుడందేవేత మూర్తులకు పూజలు చేసేందుకు నాగోబా సన్నిధి నుండి మెస్రం వంశస్థులు పయనమయ్యారు.

Also read:

