నాగ్ పూర్ (Nagpur) అల్లర్ల తర్వాత మహారాష్ట్ర సైబర్ పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 140కి పైగా రెచ్చేగొట్టే విధంగా ఉన్న పోస్టులను గుర్తించిన పోలీసులు వాటిని వెంటనే తొలగించాలని ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) ప్రకారం నోటీసులిచ్చారు. 10కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టిన నాగ్ పూర్ సైబర్ సెల్ పోలీసులు బంగ్లాదేశ్ కు చెందిన ఒక ఫేస్ బుక్ అకౌంట్ ను గుర్తించారు. (Nagpur) నాగ్ పూర్ లో పెద్ద ఎత్తున అల్లర్లను ప్రేరేపిస్తామని ఆ పోస్టులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నాగ్ పూర్ అల్లర్లకు సంబంధించిన కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు 18 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 200 మందిని గుర్తించిన పోలీసులు మరో వెయ్యి మంది అనుమానితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.
నాగ్ పూర్ అల్లర్ల తర్వాత మహారాష్ట్ర సైబర్ పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 140కి పైగా రెచ్చేగొట్టే విధంగా ఉన్న పోస్టులను గుర్తించిన పోలీసులు వాటిని వెంటనే తొలగించాలని ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) ప్రకారం నోటీసులిచ్చారు. 10కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టిన నాగ్ పూర్ సైబర్ సెల్ పోలీసులు బంగ్లాదేశ్ కు చెందిన ఒక ఫేస్ బుక్ అకౌంట్ ను గుర్తించారు. నాగ్ పూర్ లో పెద్ద ఎత్తున అల్లర్లను ప్రేరేపిస్తామని ఆ పోస్టులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నాగ్ పూర్ అల్లర్లకు సంబంధించిన కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు 18 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 200 మందిని గుర్తించిన పోలీసులు మరో వెయ్యి మంది అనుమానితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.
Also read:

