Narayanpet: ఒక్క బండ పగలగొడ్తే 25 వేల ఎకరాలకు నీళ్లు

Narayanpet

నారాయణపేట (Narayanpet) : సంగం బండ ప్రాజెక్ట్ లిఫ్ట్​ఇరిగేషన్ లో నీటికి బండనే అడ్డంకిగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్క బండను పగలగొడ్తే 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నారాయణపేట జిల్లా (Narayanpet) మక్తల్ నియోజకవర్గంలో ఉన్న సంగం బండ రిజర్వాయర్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో భట్టిమాట్లాడారు. ‘సంగంబండ రిజర్వాయర్ నుంచి 70 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిర్మించారు.

ఒక్క బండను తొలగించకుండా దశాబ్ది కాలంగా బీఆర్ఎస్​నిర్లక్ష్యంగా చేసింది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటి కోసం ఏళ్లుగా ఎదురుచూడాల్సిన దుస్థితి ఉంది. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను పూర్తి చేసి మక్తల్​కు నీరందిస్తం. సంగం బండ పాత గ్రామంలో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తం. త్వరలో ఐదు ఎకరాలకు రైతు భరోసా నిధులు రిలీజ్​చేస్తం’అని భట్టి తెలిపారు.

సంగం బండ ప్రాజెక్ట్ లిఫ్ట్​ఇరిగేషన్ లో నీటికి బండనే అడ్డంకిగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్క బండను పగలగొడ్తే 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఉన్న సంగం బండ రిజర్వాయర్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో భట్టిమాట్లాడారు. ‘సంగంబండ రిజర్వాయర్ నుంచి 70 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిర్మించారు. ఒక్క బండను తొలగించకుండా దశాబ్ది కాలంగా బీఆర్ఎస్​నిర్లక్ష్యంగా చేసింది.