Elections: కొత్త ఎన్నికల కమిషనర్లుగా…

ఢిల్లీ: కేంద్రం ఎన్నికల(Elections) సంఘంలో ఖాళీ అయిన రెండు కమిషనర్ పదవుల భర్తీకి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ భేటీ అయ్యింది. మొత్తం 212 మంది పేర్ల నుంచి ఇద్దరిని కమిటీ ఎంపిక చేసింది. ఫైనల్ గా ఈసీలుగా మాజీ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ను ఈసీలుగా ఎంపిక చేశారు(Elections) . జ్ఞానేష్‌కుమార్‌.. 1988 బ్యాచ్‌ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ మాజీ అధికారి. ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో కేంద్ర హోం శాఖ వ్యవహరాల తరఫున కశ్మీర్‌ డివిజన్‌ను పర్యవేక్షించారు. గతంలో పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు.

సుఖ్ బీర్ సింగ్ సంధూ పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ అధికారి. కాగా గత నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్‌ పోస్టులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని సెర్చ్ కమిటీ కొత్తగా ఎంపిక చేసింది. నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది.

అనంతరం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో అధిర్‌తో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీ అనంతరం అధిర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉంది. తొలుత నాకు 212 పేర్లను పంపించారు. సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేశ్‌ను ఎంపిక చేశారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ సభ్యులుగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

Also read: