- నియమించిన రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము
- వచ్చే నెల 11 ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా (Sanjeevkhanna) ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గెజిట్ విడుదల చేశారు. నవంబర్ 10 తేదీతో భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగుస్తుంది.
తనస్థానంలో సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదిస్తూ జస్టిస్ చంద్రచూడ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపింది. పరిశీలించిన రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము సంజీవ్ ఖన్నా నియమిస్తూ గెజిట్ విడుదల చేశారు. సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే 13, 2025తో ముగుస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేగ్ వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో వెల్లడించారు.
/shethepeople/media/media_files/2024/10/17/NeWqbK9oXPIO11uQ5Y7P.png)
సంజీవ్ ఖన్నా (Sanjeevkhanna) 1983లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా ఎన్ రోల్ చేసుకున్నారు. తీస్ హజారీ జిల్లా కోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యునల్ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
2006లో అక్కడే శాశ్వత జడ్జిగా ప్రమోట్ అయ్యారు. జస్టిస్ ఖన్నా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గా, భోపాల్ లోని జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2019 జనవరి 19న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన చంద్రచూడ్ తర్వాత సీనియర్ జడ్జిగా ఉండటంతో సీజేఐగా అవకాశం దక్కింది.
సంజీవ్ ఖన్నా 1983లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా ఎన్ రోల్ చేసుకున్నారు. తీస్ హజారీ జిల్లా కోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యునల్ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

Also read: