తెలంగాణలోని (Nizamabad) district జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని Akola నగరానికి బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు National Highway 44 పై ప్రయాణిస్తోంది. తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో (Nizamabad) ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలోని గన్నారం వద్ద డ్రైవర్ అదుపు కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో మృతులలో మంజుష అనే మహిళ, ఆమె ఏడేళ్ల కుమారుడు రిషి ఉన్నారు. మరో వ్యక్తిని అబ్బాస్ (40)గా గుర్తించారు. అయితే మరో మృతదేహం గుర్తింపు ఇంకా జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదం తర్వాత కొంతసేపు హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చారు.ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Also read:

