తిరుమల(Triumala) శ్రీవారి లడ్డూ ప్రసాదం గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇంకా ఆగట్లేదు. ఓవైపు లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే వివాదం నడుస్తుండగా.. తాజాగా స్వామివారి లడ్డూలో పొగాకు ప్యాకెట్ వచ్చిందని కొందరు భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై టీటీడీ స్పందించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందనేది నిజంకాదని తెలిపింది. కొందరు భక్తులు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలా చేయొద్దని విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు పోటులో శ్రీవైష్ణవ బ్రహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలు, నియనిష్ఠలతో లడ్డూలను తయారు చేస్తారని వెల్లడించింది. లడ్డూల తయారీ సీసీటీవీల పర్యవేక్షణలో జరగుతుంది. ఇంతటి పకడ్బందీ చర్యల నడుమ తయారు చేసిన లడ్డూలో పొగాకు పొట్లం రావడం అబద్ధం అని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నా
మరోవైపు తిరుమలలో (Triumala) లడ్డూను కల్తీ చేసినవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పలువురు మఠాధిపతులు, హిందూ సంఘాలు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ధర్నాకు దిగారు. సేవ్ తిరుమల(Triumala), సేవ్ టీటీడీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Also read :
Jagganguda: బర్త్డే పార్టీకి పిలిచి బంగారం చోరీ

