ఫిజియాలజీ, మెడిసిన్ విభాగాల్లో పరిశోధనలకు గాను ఇద్దరు అమెరికన్ సైంటిస్టులకు నోబెల్ అవార్డు (Nobel Prize) దక్కింది. ఈ మేరకు ఇవాళ నోబెల్ అవార్డు కమిటీ ప్రకటించింది. జీన్ రెగ్యులేషన్ లో మైక్రో ఆర్ఎన్ఏ కణాలు ఏవిధంగా కీలకపాత్ర పోషిస్తాయో వీరిద్దరు జరిపిన పరిశోధనలకుగాను ఈ పురస్కారం దక్కింది. “జీన్ రెగ్యులేషన్ లో వీరి పరిశోధనలతో కొత్త ఆవిష్కరణ చేశారని, ఇది మానవులతో సహా పలు జీవుల జీవనశైలికి ఉపయోగపడుతుంది” అని నోబెల్(Nobel Prize) అసెంబ్లీ అభిప్రాయపడింది. ఈ మేరకు స్వీడన్ లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ విభాగం నుంచి వీరిని ఎంపిక చేసింది. విజేతలకు 11 మిలియన్ స్వీడిస్ క్రౌన్స్ ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది.
Also read:

