- నోటిఫికేషన్ (Nomintions) రిలీజ్ చేసిన కలెక్టర్లు
- రిటర్నింగ్ ఆఫీసులకు భారీ బందోబస్తు
- తొలి రోజే ఖమ్మంలో నామినేషన్ వేసిన తుమ్మల
- వరంగల్ ఈస్ట్ లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి వినీత్ రావు
హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల (Nominations) ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారులు(కలెక్టర్లు) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం 11 గంటలకు ఫారం-1 నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత నామినేషన్లను(Nominations) స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల పదో తేదీ వరకు కొనసాగనుంది. ఈసారి అభ్యర్థుల క్రైమ్ రికార్డు స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ఆ వివరాలను మూడు దఫాలు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని పేర్కొంది. ఒకవేళ అభ్యర్థి జైలులో ఉన్నపక్షంలో అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇవాళ ఉదయం ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ ఈస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి వినీత్ రావు నామినేషన్ వేశారు. ఇవాళ, రేపు, 7, 8, 9, 10 తేదీలలో భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. 117 స్థానాలకు బీఆర్ఎస్, 100 స్థానాలకు కాంగ్రెస్, 88 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రకటించాయి. వరంగల్ ఈస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి వినీత్ రావు నామినేషన్ వేశారు. ఇవాళ, రేపు, 7, 8, 9, 10 తేదీలలో భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. 117 స్థానాలకు బీఆర్ఎస్, 100 స్థానాలకు కాంగ్రెస్, 88 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి.
Also Read:

