మూజువాణీ ఓటుతో ఎన్నిక లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ (Om Birla) ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు బలపర్చారు. ఇండియా కూటమి అభ్యర్థిగా కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా.. విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంట రాగా.. ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు. ఆయనకు ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ సహా లోక్‌సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి (Om Birla) ఓం బిర్లా. ఆయనకన్నా ముందు ఎంఏ అయ్యంగార్, జీఎస్ ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ అయ్యారు.
లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు బలపర్చారు. ఇండియా కూటమి అభ్యర్థిగా కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా.. విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంట రాగా.. ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు. ఆయనకు ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ సహా లోక్‌సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకన్నా ముందు ఎంఏ అయ్యంగార్, జీఎస్ ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ అయ్యారు.
Also read:
CASH :క్యాష్ డబుల్చేస్తామని 33లక్షలతో పరార్

