ఒమన్(Oman) కు సమీపంలో ఆయిల్ షిప్ మునిగిపోయిన ఘటనలో 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 13 మంది భారతీయులు ఉండగా.. మరో ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నారు. ఒమన్(Oman) మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ కథనం ప్రకారం.. 16 మంది సిబ్బందితో కొమొరోస్ జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ నౌక రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో రాస్ ఓడరేవు నగరమైన డుక్మ్ సమీపంలో మునిగిపోయింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం గల్లంతైనట్టు వెల్లడించింది. వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే నౌక తలకిందులుగా ఉండిపోయిందని తెలుస్తోంది.
ALSO READ :

