Jakkanna: అది జక్కన్నకే తెలుసు

తెలుగు సినిమా రేంజ్​ని వరల్డ్​వైడ్​గా తీసుకెళ్లిన ‘బాహుబలి’ (Jakkanna)మళ్లీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ బ్లాక్‌ బస్టర్‌ విడుదలై పదేండ్లు కంప్లీట్​అయిన సందర్భంగా.. ‘ది ఎపిక్’ టైటిల్‌తో అక్టోబ‌ర్ 31న థియేట‌ర్లలో రీ రిలీజ్ చేయ‌నున్నట్టు ఇప్పటికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ర‌న్ టైమ్ హాట్ టాపిక్ గా మారింది. దీని నిడివి 5 గంటలకు పైగానే ఉంటుందని ఒకరు, 4 గంటలు అని మరొకరు పోస్ట్‌లు పెడుతున్నారు. దానికి త‌గ్గట్టే నిర్మాత శోభు యార్లగ‌డ్డ కూడా బాహుబ‌లి ది ఎపిక్ ర‌న్ టైమ్ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ టైమంత ఉంటుంద‌ని చెప్పాడు. దీంతో రకరకాల వార్తలు నెట్టింట షేర్‌ అవుతున్నాయి. తాజాగా దీనిపై నటుడు రానా స్పందించాడు.(Jakkanna) ‘బాహుబలి: ది ఎపిక్‌ ర‌న్ టైమ్ ఎంతున్నా నాకు సంతోష‌మే. ఈ ఇయ‌ర్ నేను ఏ సినిమాలో యాక్ట్ చేయ‌కుండానే నాకు బ్లాక్ బ‌స్టర్ రానుంది. రన్‌టైమ్‌ ఎంతనేది నాకు కూడా చెప్పలేదు. 4 గంటలు అని పోస్ట్‌లు పెడుతున్నారు. అంత నిడివి ఉంటే ఆడియన్స్ చూస్తారా!. దీని రన్​టైం కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసు. ఆయన చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. నాకైతే ఆయన ఏం చెప్పలేదు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. రానా నిర్మాతగా వ్యవహరించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం జులై 18న విడుదల కానుంది.

Also Read :