స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు (OTT) ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. విజయ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా, శ్రీని గుబ్బల నిర్మించారు. (OTT)
ఈ సినిమా 46 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులు అందుకొని విశేషమైన ప్రశంసలు పొందింది. ఆగస్టు 29న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ (X) ద్వారా పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.
1980 నుంచి 1996 మధ్య జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య (దయానంద్ రెడ్డి) చేరదీస్తాడు. కబడ్డీలో జాతీయ స్థాయి ఆటగాడిగా అవతరించాలని అర్జున్ కలలు కంటాడు. ఈ ప్రయాణంలో దేవిక (సిజా రోజ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆట కోసం ప్రేమను త్యజిస్తాడు.
తరువాత దేశం తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో పతకం సాధిస్తాడు. అయితే తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల వల్ల మద్యానికి బానిసవుతాడు. తాను ప్రాణంగా ప్రేమించే కబడ్డీని దూరం పెట్టాల్సి వస్తుంది. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ జర్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Also read: