పల్లా గో బ్యాక్
–చేర్యాలలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నిరసన సెగ
-– జేఏసీ నేతలు, బీఆర్ఎస్లీడర్ల మధ్య వాగ్వాదం
–కోడ్వచ్చిన తర్వాత ఇక్కడికి ఎందుకొచ్చారని నిలదీత
సిద్దిపేట: ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తో జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ చేర్యాల బంద్ చేపట్టారు. నిరాహారదీక్ష వద్దకు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేయగా జేఏసీ నేతలు అడ్డుకున్నారు. పల్లా గో బ్యాక్‌అంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్న పట్టించుకోక.. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రావడం ఏంటని ఆయన్ను నిలదీశారు. ఈ క్రమంలో జేఏసీ నేతలు, బీఆర్ఎస్ లీడర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో చేర్యాల పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు.
Read More:
Rahul Gandhi : దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణాలోనే ఉంది
కాంగ్రెస్: కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చందర్ రావు