క్యాష్(CASH) ను డబుల్ చేస్తామని మోసం చేస్తున్న బీహార్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ఈ నెల 22న ఆర్ఎంపీ వైద్యుడు శ్రీరామోజు రామాచారిని ముఠా సభ్యులు కలిశారు. మీ దగ్గర ఉన్న నగదును రెట్టింపు చేస్తామని నమ్మించారు. కాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ నరేశ్ యాదవ్ గతంలో చందనపల్లి గ్రామంలో తాపీ మేస్త్రీగా పని చేసినాడు. ఆ సమయంలో రామాచారి ఇల్లును రామ్ నరేశ్ కట్టడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో వారి మాటలు నమ్మాడు. ఈ క్రమంలో రామాచారి వద్ద రూ.33లక్షలు(CASH) తీసుకొని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్లగొండ రైల్వే స్టేషన్లో బీహార్‌కు చెందిన నిందితులు సిరాజ్, నరేశ్ యాదవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.24 లక్షలు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఆఫ్తాబ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ALSO READ :

