Tata Ernakulam: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Tata Ernakulam

అనకాపల్లి జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. (Tata Ernakulam) టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో చోటుచేసుకోగా, ఎలమంచిలి (Tata Ernakulam) రైల్వే స్టేషన్ సమీపంలో రైలును అత్యవసరంగా నిలిపివేశారు. మంటలు చెలరేగిన దృశ్యాలు, ప్రయాణికులు భయంతో పరుగులు తీసిన ఘటనలు అక్కడ తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి.రైలులోని ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై ఎలమంచిలి సమీపంలోని ఒక పాయింట్ వద్ద రైలును నిలిపివేశారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించినప్పటికీ, వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. మంటల తీవ్రత కారణంగా బోగీల్లో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.

Image

ఈ దుర్ఘటనలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. మంటలు చెలరేగిన సమయంలో ఆయన బోగీ నుంచి బయటకు రాలేకపోవడంతో ఈ ఘోరం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తీవ్ర శ్రమతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ ఘటనలో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. మృతుడికి చెందిన బ్యాగును కుటుంబసభ్యుల సమక్షంలో రైల్వే పోలీసులు తెరిచి పరిశీలించగా, అందులో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. బ్యాగులో మొత్తం రూ.5.80 లక్షల నగదు ఉన్నట్లు నిర్ధారించగా, చాలా వరకు నోట్ల కట్టలు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే కొంతమేర బంగారం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నగదు, బంగారం ఎందుకోసం తీసుకెళ్తున్నాడనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.ఈ అగ్నిప్రమాదం కారణంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైళ్లను మళ్లించడంతో పాటు, పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి రైల్వే అధికారులు కృషి చేశారు.

Also read: