Patna :వంట చేసి వడ్డించిన మోదీ

Patna :ప్రధాని న‌రేంద్ర మోదీ బీహార్ పాట్నాలోని తాక‌త్ శ్రీ హ‌రిమంద‌ర్ జీ పట్నా(Patna) సాహిబ్ గురుద్వారాను ఇవాళ సందర్శించారు. బీహార్ లో ఎన్నికల ప్రచారానికి ముందు తలపాగా ధరించి ఇవాళ ఉదయం గురుద్వారాకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం వంటశాలకు వెళ్లి వంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు లంగర్, సామూహిక భోజనం వడ్డించారు. ప్రధాని మోదీ రాక సంద‌ర్భంగా గురుద్వార వద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 18వ శ‌తాబ్ధంలో మ‌హారాజా రంజిత్ సింగ్ .. తాక‌త్ శ్రీ హ‌రిమంద‌ర్ జీ గురుద్వారాను నిర్మించారు. గురుగోబింద్ పుట్టిన ఊరు ఇదే. సిక్కు గురువుల్లో ఈయ‌న ప‌దో వ్య‌క్తి. పాట్నాలో ఆయ‌న 1666లో జ‌న్మించారు. గురుగోబింద్ త‌న తొలి రోజుల‌ను ఇక్క‌డే గ‌డిపారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆనంద్‌పుర్ సాహిబ్‌కు వెళ్లారు.

ALSO READ :