KTR : ఫార్ములా –ఈ కేసు లోకి ఈడీ

ఫార్ములాఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ఏసీబీ డీజీకి ఏడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌ ( KTR) పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్‌ఎండీఏ అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారు…? ఎప్పుడెప్పుడు బదిలీ చేశారు..? అన్న వివరాలను ఇవ్వాలని సూచించింది. అలాగే, హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్‌ ఏసీబీకి చేసిన ఫిర్యాదు కాపీ కూడా పంపించాలని కోరింది. ఇదే సమయంలో డబ్బు బదిలీలకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలను ఇవ్వాలని ఈడీ సూచించింది. ఫార్ములా ఈ కారు రేసులో రూ. 55 కోట్లను ప్రభుత్వం, సీఎస్ అనుమతి లేకుండా ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ, ప్రిన్స్‌పల్ సెక్రటరీ స్థాయి అధికారులతో బదలాయింపు చేసినట్లు కేటీఆర్‌( KTR)  పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై ఏసీబీ కేసు ఇప్పటికే ఫైల్ అయింది. కొత్తగా అందులో ఈడీ జోక్యం చేసుకోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

Also read :

Amit Shah: అమిత్ షాను బర్తరఫ్​ చేయాలి

Madras: భర్త మరణానంతరం, పునర్వివాహం చేసుకున్నా వాటా