పైసల్లేకున్నా సరే సెల్ఫోన్లు (Phone )తీసుకుంటూ గంజాయి అమ్ముతున్న వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మొయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామ శివారులోని ఒక షెడ్డులో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి 580 గ్రాముల గంజాయి, 92 గంజాయి చాక్లెట్లు, 5 సెల్ ఫోన్లు (Phone )స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బీహార్ కు చెందిన సౌరబ్ కుమార్ గా గుర్తించారు.
కాగా పాత నేరస్తుడైన ముజ్తాబా అలీ ఖాన్ గంజాయిని కొనటానికి రెండు చోట్ల దొంగతనం చేసిన ఫోన్లతో పట్టుబడ్డాడు. ఇతను డబ్బులకు బదులుగా ఫోన్ లను ఇచ్చి గంజాయి తీసుకున్నాడు.
Also read :
Police Station : పోలీసు స్టేషన్ లో దొంగలు పడ్డారు
Siddarameshwaralayam: హర వీర భయంకర శరభ శరభ

