ఫోన్ ట్యాపింగ్ కేసును (Phone Tapping case) సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్డిమాండ్చేశారు. బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు(Phone Tapping case) . ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఫోన్ట్యాపింగ్కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్దేశ ద్రోహానికి పాల్పడింది. దీనిపై కాంగ్రెస్‌ది మెతక వైఖరి. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దల ఒత్తిడిలకు లొంగిపోయారా? కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. ఢిల్లీ పెద్దలను ఇరికించి తన కూతురుని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయట పడేయాలని ప్లాన్చేసిండు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అందెశ్రీ పాట విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని లక్ష్మణ్స్పష్టం చేశారు.
Also read:

