రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సమగ్ర దర్యాప్తు కోసం (CBI) సీబీఐకి (CBI) అప్పగించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ అధికారే స్వయంగా బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాలని, ఫోన్ల ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశంతో ముడిపడి ఉందని అన్నారు. ఈ విషయమై తాము గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని అన్నారు. కేంద్రం జోక్యాన్ని కూడా కోరుతామని చెప్పారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సమగ్ర దర్యాప్తు కోసం (CBI) సీబీఐకి (CBI) అప్పగించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ అధికారే స్వయంగా బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాలని, ఫోన్ల ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశంతో ముడిపడి ఉందని అన్నారు. ఈ విషయమై తాము గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని అన్నారు. కేంద్రం జోక్యాన్ని కూడా కోరుతామని చెప్పారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాలని, ఫోన్ల ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశంతో ముడిపడి ఉందని అన్నారు. ఈ విషయమై తాము గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని అన్నారు. కేంద్రం జోక్యాన్ని కూడా కోరుతామని చెప్పారు.
Also read:
- Radha Kishan Rao: రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీ
- Surekha: మంత్రి సురేఖకు ‘కేటీఆర్’ లీగల్ నోటీసులు

