Viksit Bharat: ఫస్ట్ జాబ్ పొందినోళ్లకు రూ. 15 వేలు మోదీ గిఫ్ట్

Viksit Bharat

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Viksit Bharat) యువతకు శుభవార్త చెప్పారు. దేశవ్యాప్తంగా తొలి ఉద్యోగం పొందిన వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించే లక్ష్యంతో “ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన” పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు (Viksit Bharat) ప్రకటించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం తన ప్రసంగంలో మోదీ ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ₹1 లక్ష కోట్లు కేటాయించిందని తెలిపారు. సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ, ఈ పథకం ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు.

తొలి ఉద్యోగం పొందిన వారికి ₹15,000 నగదు బహుమతి
ఈ పథకం కింద, తొలిసారి ఉద్యోగం పొందిన యువతీయువకులకు ₹15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది ఒక విధంగా కొత్తగా వృత్తిలోకి అడుగుపెట్టే వారికి ప్రోత్సాహకంగా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది.

ఉపాధి అవకాశాలు – 3.5 కోట్లకు పైగా
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని మోదీ తెలిపారు. ఇది కేవలం ఉద్యోగాలను కల్పించడం మాత్రమే కాదు, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడే దిశగా ముందడుగని చెప్పారు.

ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలు
తొలి ఉద్యోగం ఇచ్చే కంపెనీలు, పరిశ్రమలకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు పన్ను రాయితీలు, సబ్సిడీలు లేదా ఇతర ఆర్థిక సహాయం రూపంలో ఉండవచ్చని సమాచారం.

మోదీ మాట్లాడుతూ, “భారత్‌ను వికసిత్ దేశంగా తీర్చిదిద్దడం కోసం యువత శక్తి అవసరం. ఈ పథకం ద్వారా యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం నెలకొనేలా మేము కృషి చేస్తాం” అన్నారు.

Also read: