PM Modi : మహిళల జోలికొస్తే ఊరుకుంటామా?

మహిళల జోలికొస్తే ఊరుకుంటామా?

ఆపరేషన్​ సిందూర్​ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అది భారతీయుల విలువలు, భావోద్వేగాలకు సంబంధించిన అంశమని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)అన్నారు. మోదీతో పోటీ ఎలా ఉంటుందో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారు కలలో కూడా ఊహించి ఉండరన్నారు.

PM Narendra Modi to inaugurate Grameen Bharat Mahotsav in Delhi today |  Latest News India - Hindustan Times

మన మహిళల నుదుటిపై సిందూరం తొలగించే వారు నామరూపాల్లేకుండా పోతారని రుజువు చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్​ తర్వాత తొలిసారి సొంతరాష్ట్రం గుజరాత్​లో ఇవాళ ఆయన పర్యటించారు.

Operation Sindoor India Airstrike In Pakistan Sindoor Ka Mahatva Kya Hai  Sindoor - Amar Ujala Hindi News Live - Operation Sindoor:जानिए आखिर क्यों  दिया पीएम मोदी ने सैन्य अभियान को "ऑपरेशन सिंदूर"

ఈ సందర్భంగా రూ.77 వేల కోట్లతో చేపట్టిన ఎలక్ట్రిక్​ లొకొమోటివ్​ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు. మరో రూ.24 వేల కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దాహోద్​లో బహిరంగసభలో మాట్లాడారు. 140 కోట్ల మంది భారతీయులు వికసిత్​ భారత్​ కోసం పని చేస్తున్నట్లు చెప్పారు.2014లో ఇదేరోజు తొలిసారి పీఎంగా బాధ్యతలు చేపట్టానని మోదీ గుర్తుచేసుకున్నారు.

वो 25 मिनट... ऐसे पाकिस्तान में पूरा हुआ 'Operation Sindoor', सेना की 2  महिला ऑफिसर ने बताया-कैसे किया सब

తొలుత గుజరాత్‌ ప్రజలు తనను ఆశీర్వదించారని, తర్వాత కోట్లాది మంది భారతీయులు ఆశీస్సులు అందించారని చెప్పారు. దేశాన్ని వికసిత్ భారత్‌ దిశగా మార్చేందుకు 140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా పనిచేస్తున్నారని ప్రధాని (PM Modi)చెప్పారు.

LIVE: आतंकिस्तान के खिलाफ भारत का 'Operation Sindoor' | Missile Strike |  Pakistan | POK - YouTube

ఈ 11 ఏళ్లలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. దశాబ్దాల నాటి సంకెళ్లను బద్దలు కొట్టి, దేశాన్ని మేకిన్ ఇండియాగా మార్చుతున్నామని, కార్లు, ఫోన్లు, బొమ్మలు, ఆయుధాలు తదితరాలు మనం ఎగుమతి చేస్తున్నామని ప్రధాని చెప్పారు.

Operation Sindoor: Two Women Officials Sent A Powerful Message

ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన గుజరాత్​లో పర్యటిస్తారు. ముందుగా వడోదరా ఎయిర్​ పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడ రోడ్​ షో నిర్వహించారు. కల్నల్​ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు ఆయన వెంట రోడ్​ షోలో పాల్గొన్నారు.

 

Also read :

Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు గన్​మెన్లు

NITI AAYOG: 2047 నాటికి వికసిత్​ భారత్​