NO SOUND POLLUTION:సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ వాహనాలు స్వాధీనం

police changing the silencer

సౌండ్ పొల్యూషన్(SOUND POLLUTION) సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ద్విచక్ర వాహనాలను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టుకున్నామని తెలిపారు జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ ఎల్ రామ్. బైక్ లకు ఎక్కువగా సౌండ్ వచ్చే సైలెన్సర్ లు బిగించుకొని పట్టణంలో అతివేగంగా నడుపుతూ, బైక్ రైడింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని చెప్పారు.

ఈ తనిఖీల్లో 6 వాహనాలు స్వాధీనం చేసుకుని ఎంవీఐ కి అప్పగిస్తామన్నారు. అదేవిధంగా  బైపాస్ నుండి చిన్న కెనాల్,  గోవిందు పల్లి మీదుగా గొల్లపల్లి రోడ్డు, మంచి నీళ్ళ భావి వరకు బైక్ రైడింగ్ లు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. మఫ్టీలో పోలీసులను ఏర్పాటు చేసి పట్టుకున్నామని వెల్లడించారు. ఇలాంటి పనులు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

also read: