ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఓ పోలీసు స్టేషన్ (Police Station)లో దొంగలు పడ్డారు.. అదీ ఎక్కడో కాదు తెలంగాణలోనే.. పోలీసుల నిర్లక్ష్యంతో భారీ మొత్తంలో గంజాయి మాయం అయింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ పీఎస్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత సంవత్సరం ఫిబ్రవరిలో రాజస్థాన్ కు చెందిన అంబులెన్సులో తరలిస్తున్న 70 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని అదే అంబులన్స్ లో భద్రపరిచి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ (Police Station)ఎస్ఐ క్వార్టర్స్ పక్కన పార్కు చేసి ఉంచారు.
నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అఇయతే నిన్న అనుమానంతో అంబులెన్స్ ను పోలీసులు గమనించారు. అంబులన్స్ అద్దాలు పగలగొట్టి అందులోని సుమారు 70 కిలోల గంజాయి చోరీ చేసినట్లు గుర్తించారు.
డాగ్ స్క్వాడ్ బృందాలు, సీసీ టీవీ ఫుటేజీలతో సహాయంతో నిందితులను పట్టుకోవడాని ముమ్మరంగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ లో గంజాయి మాయం సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేపట్టారు.
Also read :
Siddarameshwaralayam: హర వీర భయంకర శరభ శరభ
Phone Tapping: వివేక్,రాజగోపాల్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే

