Election :లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 35,809 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సామగ్రి కోసం వచ్చిన సిబ్బందితో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్ద సందడి నెలకొంది. సిబ్బంది వీవీ ఫ్యాట్లు, ఈవీఎంలను చెక్ చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన కేంద్రానికి చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరనుంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో నాలుగు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. 17 లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి 45 మంది బరిలో నిలిచారు. ఆదిలాబాద్ నంచి 12 మంది పోటీ చేస్తున్నారు. 61 పోలింగ్ కేంద్రాల్లో 10 మంది లోపే ఓటర్లు ఉండటం గమనార్హం. ఈ ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఓటర్లంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. అందరూ బాధ్యతగా ఓటు వేయాలని ఇదివరకే వివిధ ప్రచార సాధనాల ద్వారా కోరింది. ఇందుకోసం వివిధ రూపాల్లో క్యాంపెయిన్ సైతం నిర్వహించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ సారి ఏపీలో కూడా రేపే ఎన్నికలు ఉండటం చాలా మంది ఏపీ బాట పట్టడంతో ఇక్కడ పోలింగ్ శాతం తగ్గుతుందేమోననే అనుమానాలున్నాయి.

మొత్తం ఓటర్లు: 3.17 కోట్ల మంది
పురుషులు: 1,58,71,493
మహిళలు: 1,58,43,339
ఇతరులు: 2,557

మొత్తం లోక్ సభ స్థానాలు: 17
పోటీలో ఉన్న అభ్యర్థులు: 525
అత్యధికం: సికింద్రాబాద్(45)
అత్యల్పం: ఆదిలాబాద్ (12)


ALSO READ :

