తెలంగాణ (Politics) రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో కాంగ్రెస్ నేత అమీర్ అలీ ఖాన్ భేటీ అయినట్టు సమాచారం. ఈ సమావేశం కవిత నివాసంలో కాకుండా వేరే ప్రదేశంలో జరిగిందని ప్రచారం వినిపిస్తోంది.(Politics)
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అమీర్ అలీ ఖాన్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమీర్ అలీ ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజహారుద్దీన్‌ను ప్రభుత్వం నామినేట్ చేయడంతో, అమీర్ అలీ ఖాన్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి.
జూబ్లీహిల్స్‌లో పొలిటికల్ హీట్
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ, కవితతో అమీర్ అలీఖాన్ సమావేశం జరగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీతో ఆయనను కవిత ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వేడెక్కుతున్నాయి.
స్పష్టత లేని ఇరువురి వైఖరి
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు కవిత గానీ, అమీర్ అలీ ఖాన్ గానీ ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై పలు చర్చలు మొదలయ్యాయి.
Also read: