పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. రొమాంటిక్, విజువల్ క్లాసిక్ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా ఎదిగిన అందాల తార ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే ఆమె తొలి తెలుగు సినిమా కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ప్రతిష్ఠాత్మకమైన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇటీవలే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులలో పెద్ద ఎక్సైట్‌మెంట్ రేపింది. యాక్షన్, ఎమోషన్, ప్రేమ మేళవింపుతో హను రాఘవపూడి శైలిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.
ఈ షెడ్యూల్‌లో హీరో ప్రభాస్, హీరోయిన్ ఇమాన్వీ ఇద్దరూ పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఇమాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. షూటింగ్ సెట్లో ‘డార్లింగ్’ ప్రభాస్ తన కోసం ఇంటి నుంచి ప్రత్యేకంగా వండించిన వంటకాలను తెప్పించారని ఇమాన్వీ వెల్లడించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేస్తూ “మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయింది. థ్యాంక్స్ డార్లింగ్ ప్రభాస్!”
అని పేర్కొంది.
ఇంతే కాదు, ప్రభాస్ పంపించిన ఆహారాన్ని వీడియో రూపంలో ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలలో దోసకాయ పచ్చడి, బిర్యానీ, స్వీట్ ఐటమ్స్ కనిపించాయి.
ఈ హార్ట్‌వార్మింగ్ పోస్ట్‌పై నెట్టింట ఫ్యాన్స్ కామెంట్లు కురిపిస్తున్నారు “ఇదే మన ప్రభాస్ మానవత్వం!”
“ప్రభాస్ అంటే అందుకే ప్రేమ!”
ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు హను రాఘవపూడి స్టైల్‌లో ప్రభాస్ రొమాంటిక్ సైడ్ కూడా చూడబోతున్నామని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు ఇప్పుడు ఒకవైపు ప్రభాస్ భోజనం వైరల్ వీడియోపై ఫిదా అవుతుండగా, మరోవైపు సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also read:

