ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బాధ్యతగల పౌరుడిగా, మాజీ పోలీసు అధికారిగా తాను స్పందించనని బీఆర్ఎస్ లీడర్ఆర్ఎస్ ప్రవీణ్(Praveen) కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరును వాడొద్దని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే తప్పు చేస్తారో వారిని చట్టపరంగా శిక్షించాలన్నారు. పాలమూరు జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. హత్య జరిగి నాలుగు రోజులవుతున్నా ఇప్పటివరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాన నిందితుడు మంత్రి జూపల్లి ఇంట్లోనే ఉన్నాడని, అక్కడే ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పారు. సీఎం ఈ రాష్టానికి హోం మంత్రి గా ఉన్నాడన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీని కోరామన్నారు. వారం రోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన(Praveen) తెలిపారు.
ALSO READ :

