Preethi Zinta: ప్రీతీ జింటా సినిమాల్లోకి రీ ఎంట్రీ

prethi zinta

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా (Preethi Zinta) తెరపై కనిపించి దాదాపు ఆరేళ్లు అవుతోంది. ఇప్పుడు ఈ బ్యూటీ ‘లాహోర్‌ 1947’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయ తెలిసిందే. సన్నీడియోల్‌ హీరోగా రాజ్‌కుమార్‌ సంతోషి డైరెక్ష న్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆమీర్‌ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాపై ప్రీతీ జింటా (Preethi Zinta) ఇన్ స్టాలో ఆసక్తికర వీడియో పోస్టే చేసింది. ఇందులో తన పాత్ర షూటింగ్‌ ముగిసిందని తెలిపింది. నా జీవితంలో చాలా సినిమాల్లో నటించాను. కానీ ఈ సినిమా నాకు ప్రత్యేకం. ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా ఈ సినిమానే కఠినమైనది. లాహోర్‌లో 1947లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అభిమానులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.’ అని ఆమె తెలిపింది. కాగా భయ్యాజీ సూపర్‌హిట్‌ మూవీలో ప్రీతీ జింటా చివరి సారిగా నటించింది. ఇందులో సన్నీడియోల్ హీరోగా యాక్ట్ చేశాడు.

Also read: