Priyanka Gandhi: వయనాడ్ లో ప్రియాంక నామినేషన్

Priyanka Gandhi

వయనాడ్ ప్రజలే తన ధైర్యమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. వయనాడ్ ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని చెప్పారు. కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్​ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఛత్తీస్​గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్​ హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే ముందు కాల్​పేట్టాలో ఏర్పాటు చేసిన రోడ్​షాలో పాల్గొన్నారు ప్రియాంక. నామినేషన్ దాఖలు చేసే ముందు కాల్​పేట్టాలో ఏర్పాటు చేసిన రోడ్​షాలో పాల్గొన్నారు.

Image ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయాలకంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని చెప్పారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగారని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా పర్యటించినట్లు చెప్పారు.

Image వయనాడ్ ప్రజలకు అండగా ఉండేందకు తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలతో కలిసి పోరాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి వయనాడ్‌కు వచ్చినట్లు తెలిపారు.

వయనాడ్ ప్రజలే తన ధైర్యమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. వయనాడ్ ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని చెప్పారు. కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.

Imageఆ సమయంలో ప్రియాంక వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్​ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఛత్తీస్​గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్​ హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే ముందు కాల్​పేట్టాలో ఏర్పాటు చేసిన రోడ్​షాలో పాల్గొన్నారు ప్రియాంక.

Also read: