ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో హైదరాబాద్(Hyd) సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది. ముఖ్యంగా షియా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు.జమ్మూ కాశ్మీర్‌లోని Ramban ప్రాంతంలో షియా ముస్లింలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. షియా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ మాట్లాడుతూ, మోసపూరితంగా ఇరాన్ నాయకుడిని హత్య చేశారని ఆరోపించారు. ఓ బలమైన నాయకుడిని కోల్పోవడం ఇదే మొదటిసారి కాదని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.
ఇదే తరహా వాతావరణం హైదరాబాద్ నగరంలోనూ కనిపించింది. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. Hyd లోని షాలిబండ, పురానీ హవేలీ, యాకుత్ పురా, డబీర్ పురా వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఖమేనీ చిత్రాలను ప్రదర్శిస్తూ నివాళి అర్పించారు. కొన్నిచోట్ల రోడ్డు పక్కన శ్రద్ధాంజలి సమావేశాలు నిర్వహించారు.

నిరసనకారులు మాట్లాడుతూ, ఇరాన్ వనరులను కబ్జా చేయడానికే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. మానవాళికి ముప్పు పొంచివుందనే సాకుతో ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు స్థానిక స్థాయిలో భావోద్వేగాలను రగిలిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిరసనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు జరిగిన మార్గమంతా పోలీసులు మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.మొత్తంగా, ఖమేనీ మరణవార్త దేశంలోని పలు ప్రాంతాల్లో భావోద్వేగ స్పందనలకు దారి తీసింది. శాంతి భద్రతలు కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టగా, పరిస్థితులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:

