గ్రామాల వారీగా కుల డేటా పెట్టండి – సీఎం రేవంత్‌కు కవిత(Kavitha)సవాల్!
తెలంగాణలో కులగణనపై రాజకీయ వేడి పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) మండిపడ్డారు. “88 కోట్ల పేజీల కుల డేటా మా వద్ద ఉంది” అంటూ సీఎం చెప్పిన మాటలను కొట్టిపారేసిన ఆమె, “ఇది కుల గణన కాదు… ఎక్స్‌రే కాదు… CT స్కాన్ కూడా కాదు… ఇది ప్రజాస్వామ్యంపై మోసపూరిత చర్య” అంటూ విమర్శలు గుప్పించారు.
2014లో ఉన్న ఓబీసీ గణాంకాలు 52% కాగా, 2024లో అవి 46%కు ఎలా తగ్గాయి? అని ప్రశ్నించిన కవిత, “ఇది ఒకే ఒక వైరుధ్యం కాదు. అలాంటి అనేక వ్యత్యాసాలు డేటాలో ఉన్నాయి” అని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, “మీరు చెబుతున్న డేటా నిజమైతే గ్రామాల వారీగా కుల డేటాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించండి! దూద్ కా దూద్, పానీ కా పానీ హోజాయేగా!” అంటూ రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి కవిత సవాల్ విసిరారు.
Also Read :

