పీఎస్ఎల్వీ సీ59 (Pslv-C59) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 శాటిలైట్స్ ను నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. సూర్యుడిపై పరిశోధనలకు ఈ ఉపగ్రహాలు సేవలు అందించనున్నాయి. ప్రోబా 3 శాటిలైట్ ను యూరోపియన్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది.

సూర్యుడి వాతవరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనుంది. కరోనా అంటే.. సూర్యుడి బయటి పొర. ఈ జంట ఉపగ్రహాల్లో ఒకదానిలో కరోనా గ్రాఫ్ ఉంటుంది. మరొకటి అలర్టర్ కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహాలలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం లాంటి పరిస్థిని కల్పిస్తే.. మరొకటి కరోనాను నిశితంగా గమనిస్తూ ఉంటుంది.
Also read :
Akunuri Murali : కేసీఆర్‌నే తప్పు పడుతా!
TSRTC : మహాలక్ష్మితో ఆర్టీసీకి లాభాలు

