పుష్ప–2 (Pushpa-2) సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన స్ప్రే కారణంగా ప్రేక్షకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని భాంద్రా ప్రాంతంలో ఉన్న గెలాక్సీ థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అస్వస్థతకు గురైన ప్రేక్షకులను అక్కడి నుంచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం ఉండబోదని వైద్యులు తెలిపారు. విశ్రాంతి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిని పెప్పర్ స్ప్రేగా భావిస్తున్నారు.
సినిమా నడుస్తున్న సమయంలో స్ప్రే చేయడం వల్ల ప్రేక్షకులు తీవ్రమైన దగ్గు, వాంతులు, గొంతులో మంటతో ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని ఓ ప్రేక్షకుడు తెలిపాడు. దీంతో సినిమా ప్రదర్శనను దాదాపు 20 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పుష్ప–2 (Pushpa-2) సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన స్ప్రే కారణంగా ప్రేక్షకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ముంబైలోని భాంద్రా ప్రాంతంలో ఉన్న గెలాక్సీ థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అస్వస్థతకు గురైన ప్రేక్షకులను అక్కడి నుంచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం ఉండబోదని వైద్యులు తెలిపారు. విశ్రాంతి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిని పెప్పర్ స్ప్రేగా భావిస్తున్నారు. సినిమా నడుస్తున్న సమయంలో స్ప్రే చేయడం వల్ల ప్రేక్షకులు తీవ్రమైన దగ్గు, వాంతులు, గొంతులో మంటతో ఇబ్బంది పడ్డారు.
శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని ఓ ప్రేక్షకుడు తెలిపాడు. దీంతో సినిమా ప్రదర్శనను దాదాపు 20 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Also read:

