పుష్ప 2 నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, “పుష్ప: ది రైజ్” విజయం తరువాత అంచనాలను పెంచింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల, “పుష్ప 2″(Pushpa) టీమ్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు విశేష స్పందన వచ్చింది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.”పుష్ప పుష్ప” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా(Pushpa) నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు. రష్మిక ,అల్లుఅర్జున్ మధ్య సాగే కపుల్ సాంగ్ అంటూ మేకర్స్ తాజాగా ప్రోమోను రిలీజ్ చశారు.ఈ కపుల్ సాంగ్ మే 29 ఉదయం 11 .07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కపుల్ సాంగ్‍ను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా ఆరు భాషల్లో పాడారు.
ALSO READ :

