ఎడారి దేశమైన ఖతార్ (Qatar) లో రోడ్లు నీలం రంగులో ఉంటాయి. నలుపు రంగులో ఉన్న రోడ్లను బ్లూలోకి మార్చడానికి అక్కడి పాలకులు 2019 సంవత్సరంలో ఓ ప్రాజెక్ట్ ని చేపట్టారు . అయితే రోడ్లకు నలుపు రంగు కాకుండా బ్లూ కలర్ వేయడానికి ఓ పెద్ద కారణమే ఉంది. అక్కడి వేడి కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై బ్లూ కలర్ వేయడంతో అక్కడి ఉష్ణోగ్రతలో 50% తేడా వచ్చింది. అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో అయితే ఒక మిల్లీమీటర్ మందపాటి నీలం పూత పూస్తారు. దీంతో ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడంతోపాటు సూర్యుడి రేడియేషన్ ని 50% దాకా తగ్గించొచ్చని సైంటిస్టులు చెప్పారు. అందుకనే ఇక్కడ రోడ్లను నీలం రంగులోకి మార్చేశారు. కాగా దోహాలో కొన్ని వీధుల్లో కూడా రోడ్లు నీలం రంగులో ఉంటాయి. నీలం రంగు పెయింట్ వేసిన తర్వాత అది బ్లూ కలర్ లోకి మారుతుంది.
Also read :
Pathanjali : తప్పు ఒప్పుకున్నారుగా!
Samyuktha Menon : ఇక హిందీ సినిమాల్లోనా?

