ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో అనుసరిస్తున్న పద్ధతిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తిని (Raghunandan rao) వ్యక్తం చేశారు. విచారణ ఎటు దారి పడుతోందో ఎవరికీ అర్థం కావడం లేదని విమర్శించారు. “నేనే ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని, నేనే ఫిర్యాదు చేసిన వ్యక్తిని. కానీ సిట్ (SIT) విచారణకు ఇప్పటిదాకా (Raghunandan rao) నన్ను పిలవలేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఘునందన్ రావు మాట్లాడుతూ – “డుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే అప్పుడే ఫిర్యాదు చేశాను. కానీ విచారణలో నా వ్యాఖ్యలను నమోదు చేయకుండా, సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారించడం ఆశ్చర్యకరం” అని అన్నారు.
ఇది చట్టపరమైన విచారణ కాకుండా, రాజకీయ ప్రభావం చూపే గాంధీ భవన్ – జూబ్లీహిల్స్ మధ్య పంచాయితీగా మారిందని వ్యాఖ్యానించారు. సిట్‌లో చిత్తశుద్ధి లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
“ఎవరిని అనుమానిస్తున్నారు, వారినే విచారించాలి. బాధితులను వదిలేసి రాజకీయంగా అనుకూలమైన వారిపై దృష్టి సారించడం సమంజసం కాదు. ఈ విచారణకు న్యాయ బద్ధత ఉండాలి” అంటూ సిట్ పని తీరు పట్ల గట్టి ప్రశ్నలు విసిరారు.
“ఇంతకాలం తర్వాత కూడా ఏ క్లారిటీ లేదు. విచారణకు మలుపు ఏమిటో అర్థం కావడం లేదు. అసలు నిజాలను వెలికి తీయాలన్న ఉద్దేశం ఉందా?” అంటూ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం విచారణను వాడుకుంటే అది ప్రజాస్వామ్యానికి ముప్పు అని హెచ్చరించారు.ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు.
తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను సిట్ విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
Also Read :

