Rahul Gandhi : రాహుల్ ఆస్తి రూ. 20 కోట్లు

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi )నిన్న నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో తన నికర సంపద రూ.20కోట్లుగా వెల్లడించారు. రూ.9.24కోట్లు చరాస్తులు, రూ.11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

చరాస్తుల్లో రూ.4.33కోట్లు బాండ్లు-షేర్ల రూపంలో, రూ.3.81కోట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉన్నాయని తెలిపారు. తన వద్ద రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 61.52లక్షల విలువ చేసే నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, పోస్టల్‌ సేవింగ్స్‌, బీమా పాలసీలు, రూ.15.21లక్షల విలువైన గోల్డ్‌ బాండ్లు, రూ.4.20లక్షల విలువైన ఆభరణాలు, రూ.55వేల నగదు ఉన్నట్లు వెల్లడించారు. రూ.2022-23లో తన వార్షికాదాయం రూ.కోటిగా ప్రకటించారు. స్థిరాస్తుల్లో భాగంగా ఢిల్లీలోని మెహ్రౌలీలో 2.346 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఇందులో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా వాటాలున్నట్టు పేర్కొన్నారు.

ఇది తమకు వారసత్వంగా దక్కిన ఆస్తిగా తెలిపారు. ఇక గురుగ్రామ్‌లో రూ.9కోట్ల విలువ చేసే ఆఫీస్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.49.7లక్షల రుణాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ(Rahul Gandhi )పై సీపీఐ తరఫున అన్నీ రాజా పోటీ చేస్తున్నారు.

 

Also read :

Trump : ముందున్న ట్రంప్

Shiva Balakrishna : హెచ్ఎండీఏ శివబాలకృష్ణకు బెయిల్