‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు సాధించి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Sipligunj) మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. (Sipligunj) ఎంగేజ్‌మెంట్ జరిపించుకున్న వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాహుల్ సిప్లిగంజ్ తన ఎంగేజ్‌మెంట్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
సమాచారం ప్రకారం, రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యా రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. కొన్నేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హరిణ్యా స్వస్థలం నెల్లూరు కాగా, ఆమె తండ్రి ఓ చిన్న వ్యాపారి. అలాగే హరిణ్యా, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురని సమాచారం. విజయ్ కుమార్ 1985లో సర్వేపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి హాజరైన బంధువులు, స్నేహితులు ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇవి వైరల్‌గా మారాయి. రాహుల్ అభిమానులు ఈ వార్త విని ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన కొత్త జీవితం సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ పేరు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగడానికి కారణమైనది ఆస్కార్ అవార్డు పొందిన “నాటు నాటు” పాట. ఆ పాట విజయంతో ఆయనకు పేరు ప్రతిష్టలు మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. కోటి నగదు ప్రోత్సాహక బహుమతిగా లభించింది.
ఇప్పటికి రాహుల్ ఎంగేజ్‌మెంట్ వార్త బయటకు రావడంతో, అభిమానుల్లో “పెళ్లి ఎప్పుడు?” అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ సాగుతుండగా, త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
Also read:
- Adilabad: వరద నీటిలో మునిగిన పట్టణాలు
- Rajinikanth: 50 ఏళ్ల సినీ ప్రస్థానం, లెజెండ్‌కు దేశవ్యాప్త శుభాకాంక్షలు