Rahul :ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ నేత భోజనం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul) గాంధీ ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ ను విజిట్ చేశారు. అనంతరం అక్కడి క్యాంటీన్ లో భోజనం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు సర్ప్రైజ్ గా ఉంటాయని అన్నారు. దేశంలో ఇండియా సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏడు సీట్లు ఇండియా కూటమే గెలుస్తుందని చెప్పారు. ప్రధాని మోదీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్ల పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను అధానికి దోచి పెడ్తున్నారని ఆరోపించారు. దేశంలో 90 శాతం ఉన్న గరిభ్, దళితులు, వెనుకబడి ఉన్న వాళ్ల కోసమే ఈ ఎన్నికలని అన్నారు.
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాహుల్(Rahul)..
ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్.. మెట్రోలో ప్రయాణించారు. సామాన్య ప్రజలతో ప్రయాణిస్తు వారితో ఫొటోలు దిగారు. ఈశాన్య ఢిల్లీ లోక్ సభ అభ్యర్థి.. కన్హయ్య కుమార్ తో కలిసి మంగోల్ పురిలో జరిగే.. ర్యాలీకి బయలు.

ALSO READ :