S.I Ajay: రాయికల్ ఎస్సై అజయ్ పరార్​

SI Ajay

జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి ఏసీబీ దాడులు చేయడంతో ఎస్సై అజయ్ (S.I Ajay) పరార్ అయ్యారు. ఇటిక్యాల గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి అనే వ్యక్తికి చెందని ట్రాక్టర్లను ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమయం లో సీజ్ చేసి పీఎస్​కు తరలించారు. ట్రాక్టర్లను విడిచి పెట్టడానికి ఎస్సై రూ. 50 వేల లంచం డిమాండ్ చేశాడు. ఎస్సైకి ముందుగానే రూ. 15 వేలు ఇచ్చారు. నిన్న రాత్రి 11 గంటలకు మీడియేటర్ ద్వారా మిగితా రూ. 35 వేలను పంపించారు. (S.I Ajay) లంచం డబ్బులు తీసుకునేందుకు క్వార్టర్స్​ నుంచి ఎస్సై అజయ్ బయటకు వచ్చారు. అయితే పీఎస్​ పరిసరాల్లో కార్లు అనుమానస్పదంగా కనిపించడంతో మీడియేటర్ ను తోసేసి అక్కడి నుంచి గోడ దూకి పరార్ అయినట్లు సమాచారం. మీడియేటర్ ను ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై అజయ్ కోసం ఏసీబీ ఆఫీసర్లు గాలిస్తున్నారు.

Also read: