Railway: రైల్వే ఛార్జీల పెంపుఅమల్లోకి కొత్త ధరలు

Railway

భారతీయ రైల్వే (Railway) నుండి ప్రయాణికులకు కీలక అప్డేట్ వచ్చింది. జూలై 1, 2025 నుంచి రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. ఈ పెంపు దేశవ్యాప్తంగా అన్ని పీఆర్ఎస్ , యూటీఎస్ , మాన్యువల్ టికెటింగ్ కేంద్రాల్లో అమలులోకి వచ్చాయి. రైలు ప్రయాణాలు చేసే వారు కొత్త ధరల ప్రకారం టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే జూలై 1వ తేదీకి ముందు బుకింగ్ చేసుకున్న టికెట్లపై ఈ ఛార్జీలు వర్తించవని (Railway) రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఈ తాజా పెంపు కింద, సెకండ్ క్లాస్ నాన్-ఏసీ టికెట్లకు కిలోమీటరుకు అర పైస (0.005 రూపాయలు) చొప్పున ఛార్జీలు పెంచారు. ఇది స్వల్పంగా కనిపించినా, పొడవాటి ప్రయాణాల్లో ఇది గణనీయంగా మారనుంది. అయితే ఈ ఛార్జీల పెంపు రెగ్యులర్ నాన్-ఏసీ క్లాస్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీలు లేదా రిజర్వేషన్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.

ఇక సబర్బన్ (పట్టణ శివార్ల ప్రాంతాల్లో నడిచే) రైళ్లు మరియు సీజన్ టిక్కెట్లకు ఈ పెంపు వర్తించదు. అంటే సబర్బన్ మార్గాల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరలు యథావిధిగా ఉంటాయి. ఇది రోజువారీగా ట్రైన్ ద్వారా చేసే వారికి ఊరట కలిగించే అంశం.

ఈ టికెట్ ఛార్జీల పెంపును భారతీయ రైల్వే దేశంలో ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరుగుతోన్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా పేర్కొంది. అయితే సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించే నాన్-ఏసీ రైళ్లకే ఈ పెంపు వర్తించడంతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.

2025 జూలై 1 నుంచి కొనుగోలు చేసిన టికెట్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న టికెట్లకు ఛార్జీల పెంపు వర్తించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. జూలై 1 నుంచి టికెట్ల కొనుగోలుతో పాటు చేసే టికెట్ రిజర్వేషన్‌కు కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. అయితే రిజర్వేషన్‌ ఛార్జ్, సూపర్‌ఫాస్ట్‌ సర్‌ఛార్జీల్లో మార్పు ఉండదని భారతీయ రైల్వే తెలిపింది. ఛార్జీల పెంపు నేపథ్యంలో… పీఆర్ఎస్, యూటీఎస్, మాన్యువల్ టికెటింగ్ జారీ కేంద్రాలలో అవసరమైన అప్‌డేట్‌ను భారతీయ రైల్వే పూర్తి చేసింది. అయితే రైల్వే కొత్త ఛార్జీలకు సంబంధించిన కీలక అంశాలను ఇక్కడ తెలుసుకుందాం…
సబర్బన్, నాన్-సబర్బన్ మార్గాలలో సబర్బన్ ప్రయాణ ఛార్జీలు, సీజన్ టిక్కెట్ల ధరలలో ఎలాంటి మార్పు ఉండదు.
రెగ్యులర్ నాన్-ఏసీ క్లాస్‌లు (నాన్-సబర్బన్ రైళ్లు)..
సెకండ్ క్లాస్‌… నిర్దిష్ట షరతులతో కిలోమీటరుకు అర పైసల పెంపు

Also read: