టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul) సమ్మర్ ట్రిప్ లో చిల్ అవుతోంది. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది రకుల్. ఫిజీలోని కొకోమో ప్రైవేటు ఐలాండ్ లో బోటింగ్ చేస్తూ ఇచ్చిన స్టిల్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

బ్లూ, గ్రీన్ కలర్స్ మ్యాచింగ్ తో కూడిన బికినీ తో హొయలు పోతూ ఫొటోలకు స్టిల్ ఇచ్చింది రకుల్(Rakul). చాలా రిలాక్స్ డ్ మోడ్ లో సమ్మర్ లో చిల్ అవుతోంది.


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ (Rakul)ఆ తర్వాత దూసుకు పోయింది. తరువాత రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ_చేస్కో, కిక్ – 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా, స్పైడర్ వంటి సూపర్ హిట్ చిత్రాలో నటించింది.

ప్రముఖ హీరోల సరసన నటించడంతో ఆమె రేంజ్ మారిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్(Rakul) జాకీ భగ్నానీని గోవాలో ఫిబ్రవరి 21న పెండ్లి చేసుకుంది. ఏప్రిల్ 16న హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఆరంభం’ అనే పేరుతో రకుల్ ప్రీత్ సింగ్(Rakul) ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ ను కూడా ప్రారంభించింది.
ALSO READ :

