రాను బొంబాయికి రాను: 40 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తెలంగాణ జానపదం!
తెలంగాణ జానపద గీతాల పునరాగమనం ఎన్నడూ లేనంత స్థాయిలో ఆన్లైన్లో వేగంగా సాగుతోంది. “రాను బొంబాయికి రాను”(Ranu bombay) అనే పాట ఇప్పుడు దేశాన్ని దాటి విదేశాల్లోనూ దుమ్ములేపుతోంది. యూట్యూబ్‌లో విడుదలైన నాలుగు నెలల్లోనే 400 మిలియన్ల (40 కోట్ల) వ్యూస్‌ను దక్కించుకోవడం ద్వారా ఈ పాట చరిత్ర సృష్టించింది. ఇది కేవలం పాట కాదు, తెలంగాణ పల్లె గాథ, పల్లె ఊపు, పల్లె జీవన గీతం.
జానపదంలోని జాబిల్లి.
ఈ పాటకు కళ్యాణ్ కీస్ సంగీతాన్ని సమకూర్చగా, రాము రాథోడ్ ఈ పాటకు సూటిగా, ప్రజల మధుర భావోద్వేగాలకు తగినట్లుగా లిరిక్స్ రాశారు. సింగర్స్ రాము మరియు ప్రభ గళాల్లో ఈ పాటకు మరింత మసాలా వుంది. సింపుల్ ట్యూన్, ఎటువంటి ఫ్యాన్సీ ఎఫెక్ట్స్ లేకుండా.. ఈ పాట ఒక మాస్ కల్ట్ అయిపోవడం దానికి ఉన్న ప్రజా అభిమానాన్ని వెల్లడిస్తోంది.(Ranu bombay)
గల్ఫ్ నుంచి గుజరాత్ దాకా.. హిందీ టీవీ షోల్లోనూ.
ఈ పాటకు భారత్‌లోనే కాకుండా యూఎస్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. అనేకమంది హిందీ టీవీ సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులు వేశారు. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోలు.. ఈ పాట లేకుండా నడవటం లేదు.
ఎందుకు హిట్ అయ్యింది?
-
పల్లె పాటకి మోడర్న్ బీట్ మేళవించడం.
-
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కెచ్చుకునే పదాలు, బేసిక్కు అనుసరించే లిరిక్స్.
-
నాచురల్ కొరియోగ్రఫీ – ఊరంతా లైన్లో స్టెప్పులేసేలా!
-
వినసొంపైన గాత్రాలు + దృశ్య ఆవిష్కరణల సమన్వయం.
ఆదాయం & రీచ్.
ఈ పాటకు సంబంధించిన రీల్స్ మిలియన్లలో ఉన్నాయంటేనే ఎంత ఆదాయం వచ్చిందో ఊహించవచ్చు. Spotify, Apple Music, JioSaavn వంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లోనూ ఈ పాట దూసుకెళ్తోంది.
Also Read :
- Pawan kalyan: మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ
- Gurnam: రూ.49 వేల కోట్లకు మోసం చేసిన గుర్నామ్ అరెస్ట్

