రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ను అందరూ పర్యాటక స్వర్గధామంగా గుర్తిస్తారు. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు. అలాగే శ్వేత నగరం, సూర్యాస్తమయ నగరం అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ఉదయపూర్ అందాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతూంటారు.కానీ బాలీవుడ్ స్టార్ హీరో (Ranveer Singh) రణవీర్ సింగ్, దీనికి మరో ప్రత్యేకపేరు పెట్టారు — “ప్రేమనగరం”.అవును… ఈ నగరం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని (Ranveer Singh) ఆయన వెల్లడించారు. ఎందుకంటే రణవీర్–దీపిక ప్రేమకథ మొదలైన ప్రదేశం ఇదేనట.
రణవీర్ మాట్లాడుతూ… ‘‘ఉదయపూర్ అంటే నాకు కేవలం అందం కాదు… అదృష్టం కూడా’’ అని అన్నారు. ఆయన మరియు దీపిక నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘గోలియోన్ కీ రాస్‌లీలా… రామ్ లీలా’ ఎక్కువ భాగం ఈ నగరంలోనే షూట్ చేయబడింది. ఆ షూటింగ్ లొకేషన్లలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తిందని రణవీర్ సరదాగా గుర్తు చేసుకున్నారు.
ఆ సినిమా షూటింగ్ ఒక సుదీర్ఘ షెడ్యూల్‌తో సాగింది. రోజూ ఉదయపూర్ సరస్సులు, కోటలు, అందమైన రాజస్థానీ వాతావరణంలో పని చేస్తూ, అలా ప్రేమ మొదలైందట. రోజు రోజుకు ఆ బంధం మరింత బలపడింది. ‘‘అప్పటినుంచి ఇప్పుడు వరకు మా ప్రయాణం మరచిపోలేని అనుభవాలతో నిండిపోయింది’’ అని రణవీర్ అన్నారు.
తర్వాత కొన్నేళ్లు ఇద్దరూ సహజీవనం చేశారు. తమ ప్రేమను మరింత బలంగా మార్చుకున్నారు. చివరకు వీరి ప్రేమకథ ఒక అద్భుతమైన వివాహంతో ముగిసింది. ఇప్పుడు వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ‘‘మా జీవితంలో పాప పుట్టడం మా ప్రేమకు వచ్చిన అందమైన కానుక’’ అని రణవీర్ చెప్పుకొచ్చారు.
ఉదయపూర్ తనకు ఎంత అదృష్టం ఇచ్చిందో చెప్పేటప్పుడు ఆయన కళ్ల్లో ఆనందం కనిపించిందని అక్కడున్నవారు చెబుతున్నారు. ‘‘ఈ నగరం నాకు ప్రేమను ఇచ్చింది. ఆనందాన్ని ఇచ్చింది. నా జీవితాన్ని మార్చిన జ్ఞాపకాలను ఇచ్చింది’’ అని ఆయన అన్నారు.
తనలాంటి మరెందరో జంటలు కూడా ఉదయపూర్ వారి ప్రేమకథకు ఆరంభ స్థలం అయ్యిందని రణవీర్ చెప్పారు. ‘‘ఇక్కడి వాతావరణం, అందం, ప్రశాంతత… ఇవన్నీ ప్రేమను మరింత అందంగా మార్చేస్తాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పుడీ నగరానికి అందం మాత్రమే కాదు, ప్రేమకు సంకేతంగా కూడా పేరు వచ్చిందని అభిమానులు చెబుతున్నారు. రణవీర్ ఈ చిన్న కథను చెప్పడంతో ఉదయపూర్ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చేసింది.
Also read:

