‘శశి’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది యంగ్ బ్యూటీ రాశి సింగ్(Rashi Singh). ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన ఈ మూవీ.. థియేట్రికల్ కంటే ఓటీటీ వేదికగానే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. (Rashi Singh) ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ సినిమాలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ఏడాది ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో తన అందం, అభినయంతో సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.కేవలం సినిమాలు మాత్రమే కాదు..
తెలుగులో ‘పాపం పసివాడు’ వంటి టీవీ సిరీస్‌లోనూ, కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లోనూ రాశి సింగ్ నటించింది. ఇక రీసెంట్ గా సుహాస్ సరసన ప్రసన్న వదనం సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా యాక్ట్ చేసింది. మే 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో రాశిసింగ్ పోలీస్ ఆఫీసర్ గా వైదేహి పాత్రలో అదరగొట్టింది. పాత్రకి తగ్గట్లు యాక్ట్ చేసి అలరించింది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది రాశి సింగ్. రీసెంట్ గా తాను దిగిన కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
Also read:

